ముషీరాబాద్, వెలుగు: వ్యవసాయ రంగం పట్ల యువత మక్కువ పెంచుకోవాలని, సరైన పద్ధతుల్లో సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో ‘రైతుబడి అగ్రిషో 2026’ను రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, శాస్త్రవేత్త వీరభద్రరావు, యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు.
