
హైదరాబాద్ లో మూసీ కూల్చివేతల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.. మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఆక్రమణలు తొలగిస్తున్న హైడ్రా మలక్ పేటలో కూల్చివేతలు చేపట్టింది. ఈ క్రమంలో మలక్ పేటలో కూల్చివేతలను అడ్డుకున్నారు బాధితులు. తమకు పునరావాసం కల్పించడంలో అన్యాయం జరుగుతోందంటూ ఆందోళన దిగారు. ఒక ఇంట్లో నాలుగు, ఆరు ఫ్యామిలీలు ఉన్నా ఒక్కటే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు. అన్ని ఫ్యామిలీలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.
ఇదిలా ఉండగా.. మూసీ పునరుద్ధరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్ 2030 నాటికి మూసీ డెవలప్మెంట్ పూర్తి చేసే టార్గెట్ తో ముందుకెళ్తోంది. మల్లన్న సాగర్‌నుంచి మంచి నీటిని తీసుకునేందుకు ట్రంక్పైప్లైన్ కోసం టెండర్లను కూడా పిలిచినట్లు తెలిసింది. మూసీ పునరుజ్జీవంకు సంబంధించి ప్రభుత్వం రివర్ బెడ్ లో ఉన్న వాళ్లను తరలించే క్రమంలో ఆందోళనలు జరిగాయి. దీంతో ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో సాయం అందించింది.
Also Read :- లిఫ్ట్లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడి మృతి
బీజేపీ పెద్దలు సైతం మూసీ పునరుజ్జీవం మంచి విషయమని సపోర్ట్ చేస్తుండటంతో వేగంగా పనులను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఒక్కో ప్రాంతాన్ని పూర్తి చేసుకుంటూ వెళితే.. బఫర్ జోన్లో ఉన్న వారు కూడా అంగీకరించి.. ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.