- మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ నరసింహారెడ్డి
వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ నరసింహారెడ్డి మంగళవారం సందర్శించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. రామప్ప గైడ్ విజయ్ ఆలయ చరిత్ర, శిల్పకళా నైపుణ్యం గురించి వివరించారు.
రామప్ప దేవాలయంలోని శిల్పకళా నైపుణ్యం అద్భుతంగా ఉందని నర్సింహారెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చరిత్రకారుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ శివనాగిరెడ్డి, యువ చరిత్రకారుడు అరవింద్ ఆర్య, తహసీల్దార్ గిరిబాబు, ఆర్‌ఐ రమేశ్, టూరిస్ట్ పోలీస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
