"బలగం " సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డ్

"బలగం " సినిమాకు ఇంటర్నేషనల్  అవార్డ్

టాలీవుడ్ లో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది బలగం(Balagam). జబర్దస్త్ కమెడియన్ వేణు తెరకెక్కించిన ఈ సినిమాలో.. ప్రియదర్శి (Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. ప్యూర్ ఫ్యామిలీ అండ్ ఎమోషన్స్ కథతో వచ్చిన బలగం ఆడియన్స్ మనసును హత్తుకుంది..వారి చేత కన్నీళ్లు పెట్టించింది.

బలగంలో బంధాలు, వాటి మధ్య ఉండే సంబంధాలకు పెద్ద పీట వేయడంతో  ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. దీంతో.. బాక్సాఫీస్ దగ్గర రూ. 50 కోట్ల భారీ కలెక్షన్స్ రాబట్టింది. కలెక్షన్స్ పరంగానే కాదు.. అవార్డులు పరంగా కూడా బలగం మూవీ సంచలనాలు సృష్టిస్తోంది. ఇటీవల ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో 9 అవార్డులను కైవసం చేసుకున్న బలగం.. ప్రపంచవ్యాప్తంగా పలు క్యాటగిరిలో మొత్తం 40కి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.

తాజాగా బలగం సినిమా మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. ఈ సినిమాకి సంగీతం అందించిన భీమ్స్ సెసిరోలియో(bheems ceciroleo) 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డ్ అందుకున్నాడు. ఈ కేటగిరీలో దాదాపు 81 దేశాలు నుంచి 780 మంది పోటీ పడగా.... అందులో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డ్ భీమ్స్ ని వరించింది. దీంతో చిత్ర యూనిట్, టాలీవుడ్ ప్రముఖులు, ఆడియన్స్ భీమ్స్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఆస్కార్ కి  కూడా పంపిస్తామని నిర్మాత దిల్ రాజు(Dill raju) ఇప్పటికే ప్రకటించారు.