యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’కు హెషమ్ వ‌హాబ్‌ మ్యూజిక్ డైరెక్టర్

యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’కు హెషమ్ వ‌హాబ్‌ మ్యూజిక్ డైరెక్టర్

విక్రాంత్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా హై బ‌డ్జెట్‌తో డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘స్పార్క్’. ఈ చిత్రాన్నితీయబోతున్నామని ప్ర‌క‌టించినప్ప‌టి నుంచే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మే నెల‌లో పూజా కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకుంటోంది. కాగా తాజాగా హెష‌మ్ వ‌హాబ్‌ స్పార్క్ సినిమాకు సంగీత సార‌థ్య బాధ్య‌త‌ల‌ను స్వీకరించించారు. ప్ర‌ణ‌వ్ మోహ‌న్ లాల్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ జంట‌గా న‌టించిన మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ ‘హ్రిదయం’సినిమాకు మ్యూజిక్‌ను అందించి అందర్నీ అలరించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమాలోని ప్ర‌తీ పాటా ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యిందో కూడా విధితమే. దీంతో స్టార్ డ‌మ్‌ను అందుకున్న హెష‌మ్ వ‌హాబ్... ఇప్పుడు రెండు తెలుగు సినిమాలు చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ - స‌మంత జంట‌గా న‌టించిన ఖుషి సినిమాకూ ఆయనే సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు స్పార్క్ సినిమాకు కూడా హెష‌మ్ సంగీతాన్ని అందించ‌డానికి ఓకే చెప్పారు. 

ఎఫ్ 3 వంటి సూప‌ర్ స‌క్సెస్‌ఫుల్ చిత్రం త‌ర్వాత మెహ‌రీన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న చిత్ర‌మిది. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో తొలి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే యూర‌ప్‌లోని అంద‌మైన లొకేష‌న్స్‌లో త‌దుప‌రి షెడ్యూల్‌ను చిత్రీక‌రించ‌బోతున్నారని సమాచారం.

 

మరిన్ని వార్తల కోసం...

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్

నుపుర్ శర్మకు బెదిరింపులు