ఆన్ లైన్‌‌లో టికెట్ బుకింగ్ పరిమితి రెట్టింపు

ఆన్ లైన్‌‌లో టికెట్ బుకింగ్ పరిమితి రెట్టింపు

రైల్లో ప్రయాణం చేయాలంటే.. ముందుగా టికెట్ బుక్ చేసుకోవాల్సి వస్తుందనే సంగతి తెలిసిందే. కానీ.. ఫ్యామిలీ మొత్తం వెళ్లాలని అనుకుంటే.. కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆన్ లైన్‌‌లో టికెట్ల బుకింగ్ కోసం రెండు లేదా మూడు యూజర్ ఐడీలు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. యాప్ లేదా వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా టికెట్ బుకింగ్ పరిమితిని రెట్టింపు చేసింది. ఒక ఐడీపై ప్రస్తుతం ఉన్న దానికంటే ఎక్కువ టికెట్లను బుక్ చేసుకోనే అవకాశం కల్పించింది. అయితే.. ఇక్కడ ఓ విషయం గమించాల్సి ఉంటుంది. ఐఆర్ సీటీసీ (IRCTC) వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటే.. ఆధార్ లింక్ చేసుకున్న వారికి మాత్రమే తమ ఐడీపై నెలకు గరిష్టంగా 24 టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. అంతకు ముందు పరిమితి 12 టికెట్లు మాత్రమే ఉండేది. ఐఆర్ సీటీసీ లేదా వెబ్ సైట్ తో ఆధార్ అనుసంధానం ఉన్న యూజర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇక ఆధార్ లింక్ చేసుకోని యూజర్లకు 12 టికెట్లు బుక్ చేసుకొనే సౌలభ్యం కల్పించింది. ఈ పరిమితి కేవలం 6 టికెట్లుగానే ఉంది.

IRCTC - Aadhaar లింక్

  • ముందుగా irctc.co.in లాగిన్ కావాలి. 
  • మై అకౌంట్ ఆఫ్షన్ ను క్లిక్ చేసి లింక్ యువర్ ఆధార్ అనే ఆఫ్షన్ ను క్లిక్ చేయాలి. 
  • ముఖ్యమైన వివరాలను నమోదు చేయాలి. 
  • ఇవన్నీ పూర్తయిన తర్వాత.. సంబంధిత మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. 
  • ఈ ఓటీపీని ఎంటర్ చేసి.. వెరిఫై బటన్ క్లిక్ చేయాలి. 
  • యూజర్ ఆధార్ వెరిఫికేషన్ పూర్తవుతుంది.