ఫిబ్రవరి 27 నుంచి.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ ఆంక్షలు

ఫిబ్రవరి 27 నుంచి.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మేటివ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్(హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐటీఐ) పనుల దృష్ట్యా బంజారాహిల్స్ రోడ్ నంబర్​ 2, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ప్రవేశ ద్వారం, ముగ్ధ జంక్షన్ వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాస్ నిర్మాణ పనుల్లో భాగంగా ఈ నెల 27 శుక్రవారం నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్​ 2లో పిల్లర్ పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో ముగ్ధ జంక్షన్–కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్–జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మధ్య ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

ప్రత్యామ్నాయ మార్గాలు, మళ్లింపులు..

ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్ నుంచి వచ్చే వారు శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్, సాగర్ సొసైటీ (ముగ్ధ) వద్ద యూటర్న్ తీసుకోవాలి. శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఇందిరానగర్ లేబర్ అడ్డా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్​5, వెంకటగిరి ఎక్స్ రోడ్స్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవచ్చు.

జూబ్లీహిల్స్ రోడ్ నం.36, 45 నుంచి ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్ వైపు వెళ్లేవారు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, వెంకటగిరి రోడ్ నం.2, యూసుఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ బస్తీ, యూసుఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ చెక్ పోస్ట్, మైత్రీవనం, అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్ మీదుగా ఇందిరానగర్ లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట మెయిన్ రోడ్ వైపు వెళ్లాలి.

కేసీపీ, బంజారాహిల్స్ రోడ్ నం.1 నుంచి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లేవారు బంజారాహిల్స్ రోడ్ నం.10 మీదుగా క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నం.45 చేరుకోవచ్చు.

మాసబ్ ట్యాంక్ నుంచి వచ్చే వారు విరించి హాస్పిటల్(1/12) వద్ద ఎడమకు తిరిగి అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వైపు వెళ్లవచ్చు.