కీలక ఖనిజాల దిగుమతి తగ్గించాలి : నీతి ఆయోగ్ కీలక ఖనిజ కమిటీ చైర్మన్ డాక్టర్ వీకే సింగ్

కీలక ఖనిజాల దిగుమతి తగ్గించాలి : నీతి ఆయోగ్ కీలక ఖనిజ కమిటీ చైర్మన్ డాక్టర్ వీకే సింగ్
  • నీతి ఆయోగ్​ కలీక ఖనిజ కమిటీ చైర్మన్​ వీకే సింగ్​ సూచన

హైదరాబాద్, వెలుగు: దేశంలో వివిధ అవసరాల కోసం కీలక ఖనిజాల దిగుమతి తగ్గించి స్వదేశంలో వాటి ఉత్పత్తి పెంచాలని నీతి ఆయోగ్​ కీలక ఖనిజ కమిటీ చైర్మన్​ డాక్టర్​ వీకే సింగ్​ అన్నారు. దేశంలో కీలక ఖనిజాల ఆవశ్యకత, లభ్యత, కీలక ఖనిజాల అన్వేషణపై గురువారం సింగరేణి భవన్​లో నీతి ఆయోగ్​ కీలక ఖనిజ కమిటీ సమావేశం నిర్వహించింది. సమావేశానికి వీకే సింగ్​ అధ్యక్షత వహించారు. 

కమిటీ మెంబర్  సెక్రటరీ, నీతి ఆయోగ్  డిప్యూటీ అడ్వైజర్  ఆర్.శరవణభవన్, మెంబర్​గా ఉన్న  సింగరేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఖనిజాల వెలికితీతకు గల అవకాశాలు, వివిధ ప్రభుత్వ మైనింగ్  సంస్థలు తీసుకోవాల్సిన చొరవ, బాధ్యతలు తదితర అంశాల పై చర్చించారు. 

ఆధునిక ప్రపంచంలో కీలక ఖనిజాలకు అధిక ప్రాధాన్యత ఉందని, కీలక ఖనిజ రంగంలో భారత్ ను స్వయంసమృద్ధి దేశంగా రూపొందించడానికి దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి ప చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన నేషనల్  క్రిటికల్  మినరల్  మిషన్  కమిటీ అభిప్రాయపడింది. అనంతరం కమిటీ చైర్మన్​ వీకే సింగ్​ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ఖనిజ పరిశ్రమలు కలిసి పనిచేస్తే కీలక ఖనిజ రంగంలో మనదే అగ్రస్థానం అవుతుందన్నారు.