టికెట్ బుకింగ్ సర్వీసెస్ లో ఇష్టా రీతిన వ్యవహరిస్తూ.. ప్యాసెంజర్ల నుంచి ఇబ్బడిముబ్బడిగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఎయిర్ లైన్స్ కంపెనీలకు డీజీసీఏ షాకిచ్చింది. టికెట్ రీఫండ్ నిబంధనల్లో కీలక మార్పులు చేసి లక్షలాది ప్రయాణికులకు ఉపశమని కల్పించింది. ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లకు సంబంధించి 48 గంటల్లోపు బుకింగ్స్ లో మార్పులు చేయాల్సి వస్తే అదనపు ఛార్జీలు వసూలు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. అదే విధంగా 48 గంటలలోపు బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నా ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేయకుండా నిబంధనల్లో మార్పులు చేసింది.
టికెట్ బుక్ చేసిన సేమ్ పర్సన్ 24 గంటల్లో ఏదైనా ఎర్రర్ గమనిస్తే.. అది కూడా ఎయిర్ లైన్స్ వెబ్ సైట్ నుంచి నేరుగా బుక్ చేసిన కస్టమర్ కు ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేయకూడని నిబంధనలు సవరించింది.
రీఫండ్ ప్రాసెస్ కు డెడ్ లైన్.. బాధ్యత ఎయిర్ లైన్స్ దే:
ప్యాసెంజర్లు లేదా కస్టమర్లు టికెట్స్ ను ట్రావెల్ ఏజెంట్ లేదా పోర్టల్ నుంచి బుక్ చేసుకుంటే.. రీఫండ్ చేసే బాధ్యత ఎయిర్ లైన్స్ దేనని తేల్చి చెప్పింది. ఏజెంట్లను తమ ప్రతినిధులుగా భావించి రీఫండ్ బాధ్యత ఎయిర్లైన్స్ తీసుకోవాలని నిబంధనల్లో పేర్కొంది. రీఫండ్ 14 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది.
ALSO READ : ట్రైన్ ప్రయాణికులకు స్విగ్గీ బంపర్ ఆఫర్..
ఇక ప్రయాణికుడు మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో టికెట్ క్యాన్సిల్ చేసుకునే విషయంలో ప్యాసెంజర్ ఫ్రెండ్లీగా నిబంధనలు సవరించారు. రీఫండ్స్ ఆన్ టైమ్ లో అందటం లేదని కంప్లైంట్స్ పెరుగుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 25 తర్వాత జరిగిన ఇండిగో సంక్షోభంతో రీఫండ్ కు సంబంధించి.. అదనపు ఛార్జీలకు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో విమాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు డీజీసీఏ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.
48 గంటల పాటు లుక్-ఇన్ ఆప్షన్:
కొత్త నిబంధనల ప్రకారం.. టికెట్ బుక్ చేసుకున్న ప్యాసెంజర్ ను.. ఎయిర్ లైన్స్ 48 గంటల పాటు.. అంటే రెండు రోజులు లుక్-ఇన్ ఆప్షన్ లో ఉంచాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ సమయంలో ప్యాసెంబర్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదా ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా మార్పులు చేసుకోవచ్చు.
అయితే ఎయిర్ లైన్స్ వెబ్ సైట్స్ నుంచి నేరుగా బుక్ చేసుకున్నప్పటికీ.. ఫ్లైట్ బయల్దేరటానికి.. లోకల్ ఫ్లైట్స్ లో 7 రోజులు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో 15 రోజులు మాత్రమే ఉన్న సందర్భంలో ఈ నిబంధనలు వర్తించవని పేర్కొంది. ఇక్కడ 48 గంటల్లో క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా.. మార్పులు చేసుకోవాలనుకున్నా.. ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని డీజీసీఏ పేర్కొంది.
