
శ్రియ లీడ్ రోల్‌లో సంగీతం బ్యాక్‌డ్రాప్‌లో పాపారావు బియ్యాల దర్శకత్వం వహించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. మే 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శ్రియ చెప్పిన విశేషాలు. ‘‘ఈ స్ర్కిప్ట్ ప్రతి తల్లిదండ్రులకు ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. నేను మ్యూజిక్ టీచర్‌గా నటించాను. ఈ రోజుల్లో పిల్లలపై చాలా ప్రెజర్ ఉంటుంది. స్కూల్‌లో టీచర్ల దగ్గర్నుంచీ పేరెంట్స్ వరకు వాళ్లపై ఒత్తిడి పెంచుతున్నారు. దాని నుంచి కాస్త రిలీఫ్ ఇవ్వడం కోసం మ్యూజిక్, డ్యాన్స్ ఏ విధంగా హెల్ప్ అవుతాయనేది ఇందులో చూడొచ్చు. మ్యూజిక్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, మెసేజ్ కూడా ఉంటుంది. మా ఫ్యామిలీ అంతా టీచర్స్, ఇంజినీర్స్ కావడంతో నాపై ఎలాంటి ప్రెజర్ ఉండేది కాదు.
వాళ్ల వల్లే అనుకున్నది చేయగలుగుతున్నా. ప్రతి పేరెంట్ కూడా పిల్లలపై ఎలాంటి ఒత్తిడి పెట్టకూడదు. ‘మన సంకల్పం బలంగా ఉంటే.. మనం సాధించలేనిదంటూ ఏదీ ఉండదు’ అని ఇందులో షర్మాన్ జోషి చెప్పే డైలాగ్ అందర్నీ ఆలోచింపజేస్తుంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారి సంగీతం సినిమాకి మరింత ప్లస్ అవుతుంది. ఇందులో పన్నెండు పాటలు ఉంటాయి. ప్రతిదీ సిచ్యువేషన్‌కు తగ్గట్టుగానే వస్తుంది. ఇప్పటికే కొన్ని పాటలు రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాది చాలెంజింగ్ క్యారెక్టర్ అయినా మ్యూజిక్, డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి.. చాలా ఈజీగా చేయగలిగాను. షూటింగ్ కి వెళ్తున్నప్పుడు ఇంటికి వెళ్తున్న ఫీలింగ్ కలిగేది. ఇది ఈ తరానికి కావాల్సిన సినిమా. పాపారావు బియ్యాల చాలా హార్డ్ వర్కర్. ఆయన దగ్గర ఇలాంటి మంచి స్ర్కిప్టులు ఇంకా ఉన్నాయి. తెలుగు రిలీజ్‌కి దిల్ రాజు గారు సపోర్ట్ చేయడం హ్యాపీ’’.