ప్రొఫైల్ పేరును మార్చిన మస్క్

ప్రొఫైల్ పేరును మార్చిన మస్క్

న్యూఢిల్లీ : టెస్లా బాస్​ మస్క్ తన ప్రొఫైల్ పేరును 'నాటియస్ మాగ్జిమస్' అని మార్చారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిని అని కూడా పేర్కొన్నారు.   ఇప్పుడున్న ఫొటోను తొలగించి చిన్ననాటి ఫొటోను అప్​లోడ్​ చేశారు.  తన ఐడీ కింద "సెంచూరియన్ ఇన్ జెరూసలేం గారిసన్" అనే క్యాప్షన్​ కనిపిస్తోంది.  హింసాత్మక లేదా సంఘ వ్యతిరేక ప్రవర్తన ఉన్న వ్యక్తిని ‘నాటియస్ మాక్సిమస్’ అంటారు. కొంటెతనం ఎక్కువగా ఉండే పిల్లలకు ఈ పదాన్ని ఎక్కువగా వాడుతారు.

ట్విటర్​ కోసం  ఇచ్చిన ఆఫర్​ను వెనక్కి తీసుకోవడంపై కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ మార్పులు చేశారు.  ఇదిలా ఉంటే, స్పామ్​ ఎకౌంట్లు ఎక్కువగా ఉన్నందున​ ట్విటర్​తో డీల్​ను రద్దు చేసుకుంటున్నట్టు మస్క్​గతంలోనే ప్రకటించారు. దీనిపై ట్విటర్​ న్యాయపోరాటం చేస్తోంది. మరోవైపు, తమ కంపెనీని కొనేందుకు టెస్లా చీఫ్​ఎలన్ మస్క్​తో చేసుకున్న 44 బిలియన్ డాలర్ల విలువైన కొనుగోలు ఒప్పందానికి తమ షేర్​హోల్డర్లు గ్రీన్​సిగ్నల్​ఇచ్చారని ట్విటర్​ తెలిపింది.