ప్రధాని మోడీ వ్యాఖ్యలు.. ముస్లిం లా బోర్డు అర్థరాత్రి సమావేశం

ప్రధాని మోడీ వ్యాఖ్యలు.. ముస్లిం లా బోర్డు అర్థరాత్రి సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పిన యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చించేందుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిన్న జూన్ 27న రాత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.

భోపాల్‌లో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోడీ.. రాజ్యాంగం కూడా పౌరులందరికీ సమాన హక్కులను ప్రస్తావిస్తోందని యూసీసీకి ఆయన గట్టి హెచ్చరికలు వినిపించారు. బుజ్జగింపులు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకూడదని బీజేపీ నిర్ణయించుకుందని, ముస్లిం సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు, రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాలు యూసీసీ అంశాన్ని ఉపయోగించుకుంటున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు.

ట్రిపుల్ తలాక్ అంశంపైనా ప్రధాని మోడీ మాట్లాడారు. ట్రిపుల్ తలాక్‌ను సమర్థిస్తున్న వారు ముస్లిం కుమార్తెలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని చెప్పారు. "మేరా బూత్ సబ్సే మజ్‌బూత్" ప్రచారంలో తమ బూత్‌లను బలోపేతం చేయడంలో సమర్థవంతమైన కృషి చేసిన దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 3వేల మంది బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మోడీ జూన్ 27న ప్రసంగించారు.