గోవిందా గోవిందా : తిరుమలలో నమాజ్ చేసిన ముస్లిం వ్యక్తి

గోవిందా గోవిందా : తిరుమలలో నమాజ్ చేసిన ముస్లిం వ్యక్తి

తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న అన్యమతస్తుల ఉద్యోగులను సైతం బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించింది. తిరుమల కొండకు వచ్చే వాహనాలపై ఇతర మతస్తుల చిహ్నాలు ఉన్నా కూడా అనుమతించరు. తిరుమల కొండపై అన్యమతస్తులకు చెందిన ఫొటోలు, లాకర్లు, చిత్ర పటాలు నిషేధం. ఇతర మతస్తులు ప్రార్థనలు చేయటం కూడా నిషేధం. అలాంటి పవిత్రమైన.. కలియుగ వైకుంఠ నాధుడు కొలువైన వేంకటేశ్వరస్వామి సన్నిధిలో.. ముస్లిం మతానికి చెందిన వ్యక్తి నమాజ్ చేయటం అనేది పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. తిరుమల కొండపైన.. అది కూడా పురోహితుల సంఘం భవనం ఉన్న చోట.. నమాజ్ చేయటం.. ఆ వీడియో సోషల్ మీడియాలో రావటం చర్చనీయాంశం అయ్యింది.

తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. . శ్రీనివాసుడి సన్నిధిలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. పురోహిత సంఘం వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో అన్యమతస్థుడు నమాజ్ చేయడం కలకలం రేపుతోంది. 10 నిమిషాల పాటు ముస్లింమతానికి చెందిన వ్యక్తి ... సీసీ కెమెరాలకి ఎదురుగానే  నమాజ్ చేస్తున్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోలేదు. పురోహిత సంఘం దగ్గర ఓ వ్యక్తి నమాజ్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో ఇలా చేయడం ఏంటని.. భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహిస్తున్నారు.

పహల్గామ్​ దాడి తరువాత తిరుమలలో ముస్లిం వ్యక్తి నమాజ్​ చేయడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. సీసీ ఫుటేజ్​ లో కనపడుతున్న వ్యక్తి ఎవరు.. ఎక్కడనుంచి వచ్చాడు.  హిందువులు పవిత్రంగా భావించే తిరుమల కొండపై ముస్లిం వ్యక్తి నమాజ్​ చేసినా పట్టించుకోకపోవడంతో అనేక​అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి...

  తిరుమలలో అన్యమత ప్రచారం చేయకూడదనే రూల్ ఉన్నా అతిక్రమించడంపై పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో అన్యమతస్తులు ప్రార్ధనలు చేయడం వెంకన్న స్వామికి అపచారం చేయడమేనని భక్తులు మండిపడ్డారు. గత ఘటనల దృష్ట్యా ఇప్పటికైనా పటిష్ట నిఘా ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు చేస్తున్నారు.