ప్రధాని మోదీపై పీహెచ్‌డీ చేసిన తొలి ముస్లిం మహిళ

ప్రధాని మోదీపై పీహెచ్‌డీ చేసిన తొలి ముస్లిం మహిళ

ప్రపంచవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనను ఆదర్శంగా భావించే వారు చాలా మంది ఉన్నారు. వారణాసికి చెందిన నజ్మా పర్వీన్ మోదీపై డాక్టరల్ స్టడీస్ పూర్తి చేసింది.  ప్రధాని మోదీపై పీహెచ్‌డీ పూర్తి చేసిన భారత్‌లో తొలి ముస్లిం మహిళ నజ్మా పర్వీన్  కావడం విశేషం. 2014లో మోదీపై పరిశోధన ప్రారంభించాగా పూర్తి చేసేందుకు సుమారుగా ఏనిమిదేళ్లు పట్టిందని ఆమె తెలిపింది. 

 కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ సంజయ్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో ఈ పరిశోధన పూర్తయింది. మోదీకి హిందూవుల్లో ఎంత క్రేజ్ ఉందో..  ముస్లింల్లో కూడా అంతే ఆదరణ ఉన్నట్లుగా ఈ పరిశోధనలో వెల్లడైన్నట్లు  బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)  ప్రొపెసర్ రాజీవ్ తెలిపారు.   

పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ కింద తాను ఓ రాజకీయ నాయకుడిని ఎంచుకోవాల్సి వచ్చిందని, అందుకే ప్రధాని మోదీని తాను ఎంచుకున్నానని నజ్మా చెప్పారు. ప్రధాని మోదీ వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె చెప్పారు.. మోదీ ఏ మతానికో, కులానికో కాదు, దేశం మొత్తానికి ప్రధాని అని తెలిపారు.   మోదీ జీవితం తనను అమితంగా ఆకట్టుకున్నదన్న నజ్మా ..దేశానికి జీవితాన్ని అంకితం చేసిన రాజకీయ నేతగా మోదీ కనిపించారని తెలిపింది.