ముస్లింలకు 150 దేశాలున్నాయి.. హిందువులకు భారత్ ఒక్కటే

ముస్లింలకు 150 దేశాలున్నాయి.. హిందువులకు భారత్ ఒక్కటే
  • CAA అనుకూల సభలో గుజరాత్ సీఎం విజయ్ రూపానీ

ముస్లింలు వెళ్లి నివసించాలనుకుంటే ప్రపంచంలో 150 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ అన్నారు. కానీ హిందువులకు ఉన్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని ఆయన చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) మద్దతుగా గుజరాత్ లోని సబర్మతీ ఆశ్రమంలో మంగళవారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అప్ఘాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లలో మత హింసను తట్టుకోలేక భారతదేశానికి వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వడంలో తప్పేంటని ప్రతిపక్షాలను ప్రశ్నించారాయన. కొత్త చట్టానికి వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న నిరసనలను ఆయన తప్పుబట్టారు. ఈ విషయంలో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ల అభిప్రాయాలను కాంగ్రెస్ గౌరవించడం లేదన్నారు.
1947లో పాకిస్థాన్ లో 22 శాతం హిందువులు ఉన్నారని, ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న హింస, అత్యాచారాల వల్ల ఇప్పుడు కేవలం 3 శాతం మాత్రమే మిగిలారని విజయ్ రూపానీ చెప్పారు. పాకిస్థాన్లో ఆ టార్చర్ భరించలేకే హిందువులు భారతదేశానికి వస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ చేయాలనుకున్న పనినే తామ చేస్తుంటే ఆ పార్టీ వ్యతిరేకిస్తోందని అన్నారాయన.

బంగ్లాదేశ్ లోనూ హిందువుల జనాబా రెండు శాతానికి చేరిందని చెప్పారు. ఇక, అఫ్ఘానిస్థాన్లోని కొన్ని దశాబ్దాల క్రితం 2 లక్షలు ఉన్న హిందూ, సిక్కు జనాభాలో నేడు మిగిలింది 500 మంది మాత్రమేని తెలిపారు. ముస్లింలు వెళ్లాలనుకుంటే ప్రపంచంలో 150 ముస్లిం దేశాలు ఉన్నాయన్నారు. కానీ హిందువులకు ఉన్న ఒకే ఒక్క దేశం భారత్, ఇక్కడికి వాళ్లు రావాలనుకోవడంలో తప్పేంటని ప్రశ్నించారు రూపానీ.

More News:

సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని మేమంటే.. ఒవైసీ పడమర అంటారు

CAAపై బీజేపీలో వ్యతిరేక గళం.. పౌరసత్వానికి, మతంతో లింక్ ఏంటీ?