ఘట్కేసర్, వెలుగు: ఎల్నినోతో వర్షాల్లేక ఎండలు మండుతుండడంతో వానలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నీటితో నిండాలని.. పాడిపంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షిస్తూ ముస్లింలు ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లోని చిన్న చెరువు వద్ద ఘట్కేసర్జామా మసీదు కమిటీ, బాలాజీనగర్ మహమ్మదీయా మసీదు కమిటీల ఆధ్వర్యంలో సలాతుల్ ఇస్తిస్కా (వర్షాల కోసం ప్రత్యేక నమాజ్) నిర్వహించారు. ఘట్కేసర్జామా మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అబ్దుల్ అజీజ్ (అను భాయ్), ప్రధాన కార్యదర్శి కుతుబుద్దీన్, మహమ్మదీయా మసీదు అధ్యక్షుడు షాషాభాయ్, ప్రధాన కార్యదర్శి తాహెర్ అలీ, మసీదుల ఇమామ్లు, ముస్లింలు పాల్గొన్నారు.
