గొంతులో ఇరుక్కున్న మటన్ బొక్క

గొంతులో ఇరుక్కున్న మటన్ బొక్క

కామారెడ్డి, వెలుగు:  కామారెడ్డి జిల్లాలో పెండ్లి భోజనానికి వెళ్లిన ఓ వ్యక్తి గొంతులో మటన్​బొక్క ఇరుక్కుపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ మండల కేంద్రానికి చెందిన బాలయ్య శుక్రవారం ఉదయం స్థానికంగా జరిగిన బంధువుల పెండ్లికి వెళ్లాడు. అందరితో కలిసి భోజనం చేస్తుండగా, మటన్​బొక్క గొంతులో ఇరుక్కుపోయింది. బయటికి తీసేందుకు ట్రై చేసినా రాలేదు. మంచినీళ్లు తాగినా లోపలికి పోలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని కామరెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. పరిశీలించిన డాక్టర్ గొంతులోని ఇరుక్కున్న మటన్ బొక్కను బయటకు తీశారు. బాలయ్య ప్రాణాపాయ స్థితి నుంచి  బయటపడ్డాడు.