సైబరాబాద్​లో ‘మై ట్రాన్స్​పోర్టు ఈజ్ సేఫ్​ యాప్’

సైబరాబాద్​లో ‘మై ట్రాన్స్​పోర్టు ఈజ్ సేఫ్​ యాప్’

గచ్చిబౌలి, వెలుగు : నో ఎంట్రీ సమయాల్లో తిరిగే  ప్రైవేటు బస్సులు, కన్​స్ట్రక్షన్​ వెహికల్స్, స్కూల్​ బస్సుల కోసం సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక యాప్​ను​ రూపొందించారు.  శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్​ కమిషనరేట్​లో ట్రాఫిక్​ డీసీపీ శ్రీనివాస్​రావు ప్రైవేట్​ బస్సులు, కన్​స్ట్రక్షన్​ వెహికల్స్​, ప్రైవేటు స్కూల్​ బస్సుల ఓనర్లతో సమావేశం నిర్వహించారు. ‘మై ట్రాన్స్​పోర్ట్​ ఈజ్ సేఫ్ యాప్​’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. నో ఎంట్రీ సమయాల్లో  తిరిగే ప్రైవేట్ బస్సులు, రెడీమిక్స్​ లారీలు, కన్ స్ట్రక్షన్ వెహికల్స్, స్కూల్ బస్సుల కోసం ప్రత్యేక స్టిక్కర్లు రూపొందించామన్నారు. 

ట్రాఫిక్ రద్దీ, రోడ్డు భద్రతా దృష్ట్యా..  అవసరమైన వెహికల్స్​కు, సెలక్టెడ్​ రూట్ లో మాత్రమే పర్మిషన్ తీసుకోవాలన్నారు. భారీ వెహికల్స్ కు ఉదయం 7.30  నుంచి 11.30 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 వరకు మధ్యలో అనుమతి లేదన్నారు.  నో ఎంట్రీ సమయాల్లో ప్రత్యేక అనుమతి ఉన్న వెహికల్స్ కు ఈ స్టిక్కర్లను ఇస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ హనుమంతరావు, అధికారులు పాల్గొన్నారు.