నా దిల్​సే నువ్వే.. ‘ఖుషి’ నుంచి లవ్ సాంగ్‌‌‌‌ రిలీజ్

నా దిల్​సే నువ్వే.. ‘ఖుషి’ నుంచి లవ్ సాంగ్‌‌‌‌ రిలీజ్

చిన్న సినిమాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ప్యాన్ ఇండియా హీరోగా గుర్తింపును తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. మంగళవారం విజయ్ బర్త్‌‌‌‌డే సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన కొత్త అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తో మేకర్స్ విషెస్ తెలియజేశారు. విజయ్ సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ చిత్రం నుంచి లవ్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ‘నా రోజా నువ్వే’ అంటూ సాగిన పాటకు డైరెక్టర్ శివ నిర్వాణనే లిరిక్స్ రాయడం విశేషం. హేషామ్ అబ్దుల్ వాహాబ్ కంపోజ్ చేయడంతో పాటు తనే స్వయంగా పాట పాడాడు.  

‘నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే’ అంటూ పాట మొత్తంలో మణిరత్నం సినిమాల పేర్లు కలిసి వచ్చేలా లిరిక్స్ ఉండటం హైలైట్. సాంగ్‌‌‌‌లో సమంత, విజయ్  కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని అందమైన లొకేషన్స్‌‌‌‌లో పాట షూట్ చేయడంతో విజువల్స్ ఇంప్రెస్ చేస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 1న విడుదల కానుంది.

మరోవైపు విజయ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌‌‌‌ కలిసి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విజయ్‌‌‌‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. పియానోని తలపిస్తూ పేర్చిన కాగితపు ముక్కలపై విజయ్ ఫోటోను చూపించడం ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.