యాక్షన్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్న నాగ చైతన్య

యాక్షన్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్న నాగ చైతన్య

బంగార్రాజు, థ్యాంక్యూ, లాల్ సింగ్ చద్ధా అంటూ ఈ ఏడాది మూడు డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగ చైతన్య.. ఇప్పుడు యాక్షన్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్నాడు. వెంకట్ ప్రభు దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఆల్రెడీ ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేసుకుంది. నిన్నటి నుంచి భారీ యాక్షన్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టారు. హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేశారు. 

మహేష్ మాథ్యూ ఆథ్వర్యంలో ఈ ఫైట్ సీన్స్ తీస్తున్నారు. ఇందులో నాగ చైతన్య ఇంటెన్స్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నాడు. అరవింద్ స్వామి విలన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా చైతూకి ఇరవై రెండోది. కృతిశెట్టి హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. శరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుడటం విశేషం.