కస్టడీ ట్రైలర్ వచ్చేసింది.. నాగచైతన్యకి ఈసారి మాస్ హిట్టు పక్కా

కస్టడీ ట్రైలర్ వచ్చేసింది..  నాగచైతన్యకి ఈసారి మాస్ హిట్టు పక్కా

అక్కినేని నాగచైతన్య హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "కస్టడీ". తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాని తెరకెక్కించాడు. తెలుగు,తమిళ బాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్ లో బాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ సినిమాలో నాగ చైతన్య నిజాయితీ పరుడైన కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు. పోలీస్ కస్టడీలో ఉన్న పేరుమోసిన రౌడీ స్టేషన్ నుండి తప్పించుకుంటాడు. ఆసమయంలో నాగ చైతన్య డ్యూటీలో ఉంటాడు. తాను డ్యూటీలో ఉండగా తప్పించుకున్న రౌడీని, ఆ కానిస్టేబుల్ ఎలా పట్టుకున్నాడు, ఆక్రమంలో తన ఫ్యామిలీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేది ట్రైలర్ లో మనకి చూపించారు.

ట్రైలర్ లో ఒక్కో షాట్ చాల ఇంప్రెసీవ్ గా ఉంది. మొదటిసారి పోలీస్ క్యారెక్టర్ చేస్తున్న నాగచైతన్య తన పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. "ఒక్కసారి న్యాయం వైపు నిలబడి చూడు నీ లైఫే మారిపోతుంది" అని నాగ చైతన్య చెప్పిన డైలాగ్స్ కూడా మెప్పించాయి. ఇక  కృతి పాత్ర కూడా కీలకం కానుంది. వెంకట్ ప్రభు మరోసారి తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయడానికి రెఢీ అయ్యాడు. ట్రైలర్లో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యువన్ శంకర్ రాజా మ్యూజిక్. మెయిన్ గా లాస్ట్ షాట్ లో వచ్చిన ఆ బిజీఏం అయితే నెక్స్ట్ లేవల్లో ఉంది. మొత్తంగా చూసుకుంటే.. కస్టడీ ట్రైలర్ ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఈ సినిమాతో అక్కినేని నాగచైతన్య సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ సినిమా థియేటర్ లో ఎన్ని వండర్స్ క్రియేట్ చేయనుందో తెలియాలంటే మే 12 వరకు ఆగాల్సిందే.

https://www.youtube.com/watch?v=jMMaZXXfwjI