అప్ర‌మ‌త్తంగా ఉండండి..వ్యాధినిరోధక శక్తిని పెంచుకొండి

అప్ర‌మ‌త్తంగా ఉండండి..వ్యాధినిరోధక శక్తిని పెంచుకొండి

మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చెన్నై కోయంబేడు మార్కెట్లో కరోనా కేసులు పెరగడంతో తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర మండలాలు నగిరి, విజయపురం, నిండ్ర మండలాలకు సంబంధించి మండల అధికారులతో ఆమె జూమ్ కెమెరా ద్వారా మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని ఆయా గ్రామాల్లో గ్రామ సెక్రటరీలు, వీఆర్వోలు, వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి నుంచి జీవన విధానం మార్చుకుని వ్యాధినిరోధక శక్తిని పెంచుకొని పోరాడాలన్నారు. కొత్త జీవన విధానాన్ని అలవర్చుకోవాలని, స్వచ్ఛ మైన ఆహారం తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించడం తో పాటు సామాజిక దూరం పాటించాలన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి, ప్రాంతాల నుంచి గ్రామాలకు వస్తే వెంటనే అధికారులు దృష్టికి సమాచారం తీసుకురావాలన్నారు. దీంతో అధికారులు అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. లాక్ డౌన్ నుంచి కొంత ఊరట లభించడం జరిగిందని, దీనిని ఆసరాగా చేసుకుని విచ్చలవిడిగా బయట తిరగరాదన్నారు. ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.