పంజాగుట్ట, వెలుగు: నాయీ బ్రాహ్మణులు రాజకీయంగా అభివృద్ధిలోకి రావాలని, జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం సాధించాలని మాజీ డీజీపీ పూర్ణచంద్రారావు పిలుపునిచ్చారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఇటీవల సర్పంచులుగా గెలుపొందిన నాయీ బ్రాహ్మణ ప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న నాయీ బ్రాహ్మణులు రాజకీయంగా కూడా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
