నైనిటాల్ సరస్సు పొంగి..ఇళ్లలోకి నీరు

నైనిటాల్ సరస్సు  పొంగి..ఇళ్లలోకి నీరు

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలోని నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. నైనిటాల్‌లో ఉన్న నైని సరస్సు ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆ సరస్సు నుంచి నీరు ఉప్పొంగి.... నగర వీధుల్లో ప్రవహిస్తోంది. పట్టణంలో ఉన్న భవనాల్లోకి, ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది. గత 24 గంటల నుంచి నైనిటాల్‌లో ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా.. నైనిటాల్‌లో ని మాల్‌ రోడ్డు నీటితో నిండిపోయింది. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరుకోవడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.