బీజేపీ పెద్దలకు సోయిలేదా : సంకినేని వెంకటేశ్వరరావు

బీజేపీ పెద్దలకు సోయిలేదా : సంకినేని వెంకటేశ్వరరావు
  • మాకు చెప్పకుండానే సైదిరెడ్డిని బీజేపీలో ఎలా చేర్చుకుంటరు?
  • మా దారి మేము చూస్కుంటం
  • బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సంకినేని 


హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి బీజేపీలో జాయిన్​కావడంపై ఆపార్టీ నల్గొండ జిల్లా నేతలు అసంతృప్తితో ఉన్నారు. తమకు కనీస సమాచారం ఇవ్వకుండానే ఆయన్ను పార్టీలో చేర్చుకున్నారంటూ బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సంకినేని వెంకటేశ్వరరావు మండిపడ్డారు. ‘ఇదెక్కడి న్యాయం. కనీసం కార్యకర్తలు, నేతలతో సంప్రదింపులు జరపాలనే విజ్ఞత కూడా లేదా పార్టీ పెద్దలకు..? ఇట్లా ఉంటే పార్టీ మనుగడా ఎలా కొనసాగుతుంది? ఇలాగే ఉంటే మా రాజకీయ భవిష్యత్తు మేము చూసుకోవాల్సి ఉంటుంది’అని అన్నారు.