హాస్పిటల్ కి నిధుల్లేవ్.. DMEపై ఎమ్మెల్యే ఫైర్

V6 Velugu Posted on May 04, 2021

నల్గొండ : DME రమేశ్ రెడ్డి తీరుపై మండిపడ్డారు నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. కరోనా కాలంలో నల్గొండ ఆస్పత్రికి నిధులు కేటాయించకుండా DME రమేశ్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాస్పత్రిలో మెడికల్ కిట్స్ గ్లౌజ్ లు, మాస్కులు, శానిటేషన్ లేక సిబ్బంది రోగులు ఇబ్బందులు పడుతున్నా నిధులు మంజూరు చేయడం లేదన్నారు. ఈ విషయంపై సీఎంకు ఫిర్యాదు చేస్తానన్నారు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి. నల్గొండ మెడికల్ కాలేజీ ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన ఆయన.. కరోనా పేషేంట్లకు అందుతున్న చికిత్సపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ లో గ్లౌజులు, మాస్కులు లేవని అధికార పార్టీ ఎమ్మెల్యేను ఇలా స్పందించారంటే రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తన ఎమ్మెల్యే నిధుల నుంచి గ్లౌజులు, మాస్కలు, ఇతర సౌకర్యాల కోసం ఐదు లక్షలు ఇస్తానన్నారు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి.

Tagged NALGONDA, corona, MLA Kancharla Bhupal Reddy, DME, Medicines,

Latest Videos

Subscribe Now

More News