కెనడాలో తెలుగు విద్యార్థి సూసైడ్

కెనడాలో తెలుగు విద్యార్థి సూసైడ్

నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థి కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని డిండి మండలం.. ఆకుతోటపల్లికి చెందిన నారాయణరావు, హైమావతిల కుమారుడైన ప్రవీణ్ రావు ఉన్నత చదువుల కోసం 2015లో కెనడా వెళ్లాడు. ఏం జరిగిందో ఏమో కానీ.. ప్రవీణ్ రావు తాను ఉంటున్న ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్ రావు మృతికి గల కారణాలు తెలియలేదు. ప్రవీణ్ రావు తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఆయనను చదివిస్తున్నారు. చదువు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం చేసి తమను చూసుకుంటాడనుకున్న కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీంటిపర్యంతమవుతున్నారు. విదేశాల్లో చదువుతున్న ప్రవీణ్ జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడంతో... ఆయన స్వగ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.