అయ్యప్పగుడిలో నమాజ్.. ప్రశ్నించిన వ్యక్తిపై కత్తితో బెదిరింపు

అయ్యప్పగుడిలో నమాజ్.. ప్రశ్నించిన వ్యక్తిపై కత్తితో బెదిరింపు

మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రతాపసింగారం గ్రామంలోని అయ్యప్ప ఆలయం వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం, ఓ వ్యక్తి ఆలయ ప్రాంగణంలోని హనుమాన్ మందిరంపైకి ఎక్కి నమాజ్ చేయడం కలకలం రేపింది. ఇది గమనించిన ఓ భక్తుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రశ్నించగా, ఆ వ్యక్తి కత్తి తీసి బెదిరించి దాడి చేయడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. 

గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు పోలీస్ వాహనం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.  పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.