వైభవంగా మా భగవతి జాగరణ్.. పాల్గొన్న  సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్

వైభవంగా మా భగవతి జాగరణ్.. పాల్గొన్న  సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్

బషీర్​బాగ్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​లో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు ‘మా వైష్ణో దేవి మాతా జాగరణ్ మండల్’ ఆధ్వర్యంలో ‘మా భగవతి విశాల్ జాగరణ్’ అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జమ్మూలోని మాతా వైష్ణో దేవి మందిర పూజారి లోకేశ్ మహారాజ్ ఈ వేడుకను ప్రారంభించగా, వేలాదిమంది భక్తులు అఖండ జ్యోతి దర్శనం, తారా రాణి కథ, భజన గంగా వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రముఖ గాయకులు ఛోటూ సింగ్ రావ్నా, సుమిత్ సైని, మురారి దహిమాలు ఆలపించిన భక్తి కీర్తనలు భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ముంచెత్తాయి. రామ్ కిషన్ అగర్వాల్, అంజనీ కుమార్ అగర్వాల్ పాల్గొన్నారు.