
వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు సంపాదించుకున్న నటుల్లో నందమూరి కథానాయకుడు.. డైనమిక్ స్టార్ నందమూరి కళ్యాణ్ ఒకరు. రీసెంట్‌గా విడుదలైన ‘బింబిసార’ చిత్రంతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సాధించారు. తాజాగా రామ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ కు ఇది19వ చిత్రం. రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు.
అందరికీ సర్ ఫ్రైజ్ ఇస్తూ మూవీకి సంబంధించిన అప్ డేట్ అందించారు. చేతిలో గన్ పట్టుకుని యాక్షన్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. కళ్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. NKR19గా వస్తున్న ఈ మూవీ షూటింగ్ గోవాలో పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ఎస్.సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ తెలియజేయనుంది.
నటీనటులు : నందమూరి కళ్యాణ్ రామ్, ఆషిక రంగనాథ్, బ్రహ్మాజి, సప్తగిరి, జయ ప్రకాష్ మాథ్యూ వర్గీస్, రాజీవ్ పిళ్లై, రవి ప్రకాష్, శివన్నారాయణ, చైతన్య కృష్ణ, రఘు కారుమంచి, మాణిక్ రెడ్డి, గబ్బర్ సింగ్ సాయి, శ్రీధర్, అశోకన్ విన్సెంట్, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ తదితరులు నటించారు.