మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్.. అదికూడా తండ్రి సినిమాతోనే

మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్.. అదికూడా తండ్రి సినిమాతోనే

నందమూరి ఫాన్స్ కి గుడ్ న్యూస్. మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఖరారైంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ నందమూరి మోక్షజ్ఞని తెరపై ప్రెజెంట్ చేయబోతున్నది మరెవరో కాదు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ప్రస్తుతం బోయపాటి యంగ్ హీరో రామ్ పోతినేనితో ఓ పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఈ సినిమా తరువాత బోయపాటి మరోసారి బాలయ్యతో సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించిన అప్డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. అదే అఖండ2. అయితే.. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేటంటే.. బాలయ్య-బోయపాటి కాంబోలో తెరకెక్కనున్న అఖండ2 మూవీతోనే నందమూరి మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నాడట. బోయపాటితో అయితేనే మోక్షజ్ఞ ఎంట్రీ పవర్ఫుల్ గా ఉంటుందని భావిస్తున్నాడట బాలయ్య.

ఈ విషయం తెసులుకున్న ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. నిజానికి బాలయ్యతో బోయపాటి మూవీ అంటే మాస్ జాతర పక్కా. అలాంటిది.. ఇప్పుడు మోక్షజ్ఞ కూడా యాడ్ అవుతున్నాడు అంటే ఆ  మాస్ ఫీస్ట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అంటూ చర్చించుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్. ఇక సినిమా అక్టోబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.