HIT 3 Collections: అఫీషియల్.. నాని కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్.. హిట్ 3 ఫస్ట్ డే వసూళ్లు ప్రకటించిన మేకర్స్

HIT 3 Collections: అఫీషియల్.. నాని కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్.. హిట్ 3 ఫస్ట్ డే వసూళ్లు ప్రకటించిన మేకర్స్

హిట్ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడో మూవీ హిట్ 3. ఈ మూవీ ఫస్ట్ డే వసూళ్లతో కుమ్మేసింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. నేడు శుక్రవారం (మే 2న) అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ వసూళ్ల వివరాలు వెల్లడించారు.  

'సర్కార్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. నేచురల్ స్టార్ నాని కెరియర్లో ఫస్ట్ డే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గ్రాసర్ గా హిట్ 3 నిలిచిందని' మేకర్స్ తెలిపారు.

నాని నటించిన 'దసరా' తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.38 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటివరకు నాని నటించిన సినిమాలలో ఇదే రికార్డు స్థాయి ఓపెనింగ్. ఇప్పుడొచ్చిన హిట్ 3తో ఆ లెక్కను క్రాస్ చేసి ముందంజలో ఉంది. అందుకు కారణం లేకపోలేదు.. నాని సక్సెస్ పరంపరలో తన సినిమాలపై ప్రేక్షకుల్లో హైప్ పెరుగుతూనే ఉంది. ఎక్కడా తగ్గట్లేదు. అందువల్ల హిట్ 3 దాన్ని దాటేసి, నానికి కొత్త ఓపెనింగ్ రికార్డు ఇచ్చింది. 

ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.49 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగిన‌ట్లు సినీ వర్గాల స‌మాచారం. అంటే, హిట్ 3 మూవీ రూ.50కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలో నిలిచింది. హిట్ 3 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి రూ.100కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. నాని కెరియర్లో అత్యధిక బిజినెస్ జరుపుకున్న మూవీగా హిట్ 3 నిలిచింది. ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా పతాకంపై హీరో నానినే నిర్మించారు.