ఈవీ వేరియంట్ లో రాబోతున్న నానో కారు

ఈవీ వేరియంట్ లో రాబోతున్న నానో కారు

తక్కువ ధర ఉండే కార్లను తయారుచేసి, మధ్య తరగతి కలల్ని సాకారం చేయడానికి టాటా కంపెనీ నానా కార్లను తీసుకొచ్చింది. రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్ లో భాగంగా 2008లో టాటా నానో కార్ ని లాంచ్ చేశారు. మొదట్లో సంచలనం సృష్టించిన నానో కార్, డిమాండ్ తగ్గడంతో దీని తయానీని నిలిపివేశారు. అయితే, తాజాగా నానో కార్ ని తిరిగి మార్కెట్లోకి తీసుకొస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ వార్తలను నిజం చేస్తూ నానో కార్లని ఎలక్ట్రిక్ వేరియంట్ లో తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఎలక్ట్రిక్ వేరియంట్ కి సంబంధించిన పూర్తి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 2025 నాటికల్లా టాటా నానో ఈవీ కార్లని మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఈ కార్ ధర 2-3 లక్షల మధ్య  ఉండొచ్చని అంచనా. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 110 టాప్ స్పీడ్.