
స్థానిక భాషలను ప్రోత్సహించిన దేశాలే అభివృద్ధిలో పురోగమించాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జాతీయ విద్యావిధానానికి మూడేండ్లు పూర్తైన సందర్భంగా అఖిలభారత విద్యా సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాన మంత్రి శ్రీ పథకం కింద పాఠశాలలకు మొదటి విడత నిధులను విడుదల చేశారు. దేశ భవిష్యత్ ను మార్చే శక్తి కేవలం విద్యకే ఉందన్నారు మోదీ.
ఏ లక్ష్యంతోనైతే దేశం ముందుకు సాగుతుందో.. ఆ లక్ష్యం నెరవేరాలంటే ఏకైక ఆయుధం విద్యేనన్నారు. పరిశోధనా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, దేశంలోని విద్యావేత్తలు చాలా కష్టపడ్డారన్నారు. 10 ప్లస్ 2 విద్యావిధానం బదులుగా.. 5 +3+3+4 తీసుకొచ్చామన్నారు మోదీ. మన విద్యా వ్యవస్థ భారత సాంప్రదాయాలను పరిరక్షించేలా ఉందని చెప్పారు. ఆధునిక సైన్స్, టెక్నాలజీలో కూడా ముందుకు సాగుతామన్నారు మోదీ. యువత ప్రతిభను భాషల ఆధారంగా అణచివేయడం అతిపెద్ద అన్యాయమని చెప్పారు.