
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో మరోసారి ములాఖత్ అనంతరం ఆ పార్టీ నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయకపోతే బెయిల్‌పై జగన్ పదేళ్లు ఎలా బయట ఉన్నారని.. సొంత బాబాయ్‌నే చంపిన అవినాశ్ బయట ఎలా తిరుగుతున్నారంటూ ప్రశ్నించారు. వైద్యారోగ్య పరీక్షల పేరుతో ఏం చేస్తారోనని భయంగా ఉందని చంద్రబాబు ఆరోగ్యం పట్ల లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. జైలు పరిసరాల్లో డ్రోన్లు ఎగురుతున్నాయని.. చంద్రబాబు లోపలికి వెళ్లే దృశ్యాలు ఎలా బయటకు వచ్చాయో చెప్పాలని నిలదీశారు. . ఇక వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై ఈడీకీ, ఐటీకి లేఖ రాస్తానని అన్నారు. ఇసుకపై సీబీఐకీ.. అలాగే మైనింగ్ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని పేర్కొన్నారు లోకేష్.
- ALSO READ | గుండె తరలింపునకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫ్లయిట్
చంద్రబాబు ఏ తప్ప చేయకపోయినా కూడా 50 రోజులుగా బంధించారని అన్నారు. ఇప్పటివరకు వైసీపీ సర్కార్ స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో.. తమ పార్టీకి డబ్బు అందాయనే ఆధారాలు చూపించలేదని ఆరోపించారు. మీకు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టండని సవాల్ విసిరారు. రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేవలం వ్యక్తిగత కక్షసాధింపుతోనే చంద్రబాబును ప్రజల్లోకి రాకుండా జైల్లో పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబును అరెస్టు చేసిన 50 రోజులయినా.. కొత్త ఆధారాలు ఏమైనా ప్రజల ముందు పెట్టారా అంటూ ప్రశ్నించారు.తమకు సంబంధించిన ఆస్తులు, అకౌంట్స్‌ను కూడా ప్రజల ముందు పెట్టామని లోకేష్ తెలిపారు.