గుండె తరలింపునకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫ్లయిట్

గుండె తరలింపునకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫ్లయిట్

గన్నవరం నుంచి తిరుపతికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది.  విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయిన జయప్రకాశ్ గుండెను గ్రీన్ ఛానల్ ద్వారా స్పెషల్ ప్లయిట్ లో తరలించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

విజయవాడలో బ్రెయిన్ డెడ్ అయిన గారపాటి జయ ప్రకాష్  గుండెను...   అవయవదానం కోసం తిరుపతికి ప్రత్యేక విమానంలో తరలించారు. కృష్ణాజిల్లా మొవ్వ మండలం చిన్నముత్తేవి గ్రామానికి చెందిన గారపాటి జయ ప్రకాష్ (22) రోడ్డు ప్రమాదంలో నిడుమోలు గ్రామం వద్ద గాయపడ్డారు .  ప్రాథమిక చికిత్స అనంతరం జయప్రకాష్ ను విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి తరలించారు.  జయప్రకాష్ శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్దారించారు,  అయితే జయప్రకాష్  బ్రెయిన్ డెడ్ కావడంతో గుండెను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు.ఇందుకు ఏపీ ప్రభుత్వం  సహకారం కోరారు. దీంతో విజవాడ ఆయుష్ ఆస్పత్రి  నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు.. అక్కడి నుంచి తిరుపతికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం  గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి  ప్రత్యేక విమానంలో గుండెను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఆస్పత్రికి తరలించారు.