తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సలహామండలి సభ్యుడు..నారా నాగేశ్వర్ రావుకు ఓయూ డాక్టరేట్

తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సలహామండలి సభ్యుడు..నారా నాగేశ్వర్ రావుకు ఓయూ డాక్టరేట్

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల సలహామండలి సభ్యుడు నారా నాగేశ్వర్ రావు డాక్టరేట్ పట్టా పొందారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మేనేజ్ మెంట్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ జి. విద్యాసాగర్ పర్యవేక్షణలో ఆయన “ దివ్యాంగుల సాధికారత – కార్పొరేట్ సామాజిక బాధ్యత– ఎంచుకున్న కొన్ని కంపెనీలపై పరిశోధన”అంశంపై రీసెర్చ్ చేసినందుకు డాక్టరేట్ ప్రదానం చేసినట్టు సోమవారం నాగేశ్వర్ రావు తెలిపారు.  తన పరిశోధనకు సహకరించిన ఓయూ మేనేజ్ మెంట్ విభాగానికి చెందిన గైడ్  ప్రొ. విద్యాసాగర్, డీన్ ప్రొ. పి. వెంకటయ్య, ప్రిన్సిపల్ ప్రొ. డి. శ్రీరాములుకు కృతజ్ఞతలు చెప్పారు.

అదేవిధంగా ఆయనను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క, ఓయూ వీసీ ప్రొ డి. రవీందర్ యాద వ్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, రాష్ట్ర దివ్యాంగుల శాఖ కమిషనర్ శైలజ, కర్ణాటక ఐటీ శాఖ కమిషనర్ సతీశ్ తదితరులు నాగేశ్వర్ రావును అభినందించి సన్మానించారు.

ఆయనకు దివ్యాంగులు, బాలలు, యువజనులకు సామాజిక సేవలందించినందుకు గతంలో జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు దక్కాయి.  రాష్ట్ర దివ్యాంగుల చట్టం– 2016 రూపకల్పన సభ్యులుగా, దివ్యాంగులు 4 శాతం రిజర్వేషన్ కమిటీ సభ్యునిగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాలల పరిరక్షణ సభ్యుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.