
హైదరాబాద్, వెలుగు: ప్రతిభావంతులైన పేద, మధ్య తరగతి విద్యార్థులను ప్రోత్సహించేందుకు నారాయణ విద్యాసంస్థలు స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఎన్‌ఎస్‌ఏటీ–2023)ను ప్రకటించాయి. దేశవ్యాప్తంగా 7వ తరగతి నుంచి 11వ తరగతి చదువుతున్న స్టూడెంట్లు ఈ టెస్ట్ రాసేందుకు అర్హులని పేర్కొంది. స్టూడెంట్లలో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు భవిష్యత్తులో రాసే పోటీ పరీక్షలకు ఇప్పటి నుంచే సన్నద్ధత చేయడం ఈ ఎన్‌ఎస్‌ఏటీ ముఖ్య ఉద్దేశమని విద్యాసంస్థల డైరెక్టర్లు సిందూర, శరణి తెలిపారు.
ఈ టెస్టులో అసాధారణ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రూ.కోటికి పైగా నగదు అవార్డులను గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 300లకు పైగా సిటీల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సైన్స్, మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ వంటి క్రిటికల్ థింకింగ్ స్కిల్స్‌ను ప్రేరేపించే ప్రశ్నలు ఎగ్జామ్‌లో ఉంటాయని తెలిపారు. ఈ ఎగ్జామ్ మంచి ప్రతిభ కనబరిస్తే 100 శాతం స్కాలర్‌షిప్ పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.