V6 News

దేశవ్యాప్తంగా నారాయణ విద్యాసంస్థల భారీ విస్తరణ...ఆరు రాష్ట్రాల్లో 38 క్యాంపస్‌ లు

దేశవ్యాప్తంగా నారాయణ విద్యాసంస్థల భారీ విస్తరణ...ఆరు రాష్ట్రాల్లో 38 క్యాంపస్‌ లు

హైదరాబాద్, వెలుగు: విద్యా రంగంలో 47 ఏండ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నారాయణ విద్యాసంస్థలు మరో కీలక మైలురాయిని చేరుకున్నాయి. 2026–-27 విద్యా సంవత్సరానికి గాను ఆరు రాష్ట్రాల్లో మొత్తం 38 కొత్త క్యాంపస్‌లను (స్కూల్స్, కాలేజీలు) ప్రారంభించనున్నట్టు సంస్థ ప్రకటించింది. అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో15, తెలంగాణలో 10, మహారాష్ట్రలో  5, గుజరాత్‌లో 3, తమిళనాడులో 3, మధ్యప్రదేశ్‌లో 2 క్యాంపస్‌లను ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ పునీత్ కొత్తప మాట్లాడారు. 

నాణ్యమైన విద్యను విద్యార్థులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ విస్తరణ చేపట్టినట్టు చెప్పారు. దేశంలోని ప్రతి జిల్లాలో నారాయణ క్యాంపస్‌ను ఏర్పాటు చేయడమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. అధునాతన డిజిటల్ లెర్నింగ్, పర్సనలైజ్డ్ మెంటరింగ్,విద్యార్థుల సంపూర్ణ వికాసానికి నారాయణ సంస్థ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని వెల్లడించారు.