నారాయణ విద్యాసంస్థ ల డైరెక్టర్ శరణికి ఫెమినా అవార్డు

నారాయణ విద్యాసంస్థ ల డైరెక్టర్ శరణికి ఫెమినా అవార్డు

హైదరాబాద్, వెలుగు: నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ శరణి పొంగూరు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆమె నార్త్ వేదికగా జరిగిన ‘ఫెమినా అచీవర్స్ అవార్డ్స్–2026’ లో ‘ఎక్సలెన్స్ ఇన్ స్టూడెంట్ మైండ్ సెట్ అండ్ లీడర్ షిప్ డెవలప్ మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణలను పెంపొదించడానికి ఆమె చేసిన విశేష కృషికిగాను ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా శరణి నారాయణ మాట్లాడారు. ‘‘ఈ గుర్తింపు నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఈ అవార్డును కలల కోసం కష్టపడే ప్రతి విద్యార్థికి అంకితం చేస్తున్నాను.

నారాయణ విద్యాసంస్థల్లో స్టూడెంట్ల కలలే మా కలలు. నారాయణ ఇనిస్టిట్యూషన్స్ లో విద్య ఎప్పుడూ ప్రామాణికంగా, ప్రభావవంతంగా, భవిష్యత్తుకు అనుగుణంగా ఉంటుంది” అని పేర్కొన్నారు. ‘ఫెమినా అచీవర్స్ అవార్డ్స్–2026’ లో శరణి పొంగూరికి పురస్కారం లభించడంపై విద్యావేత్తలు, నారాయణ విద్యాసంస్థల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.