నాలుగు నెలల మనవడికి రూ. 2 వందల 40 కోట్ల షేర్లు

నాలుగు నెలల మనవడికి రూ. 2 వందల 40 కోట్ల షేర్లు
  •     మనవడికి రూ.240 కోట్ల విలువైన షేర్లు
  •     నారాయణ మూర్తి నిర్ణయం

న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఫౌండర్​ నారాయణ మూర్తి 0.04 శాతం వాటాకు సమానమైన 15 లక్షల షేర్లను తన మనవడు ఏకాగ్రహ రోహన్ మూర్తికి బహుమతిగా ఇచ్చారని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ తెలిపింది. వీటి విలువ రూ. 240 కోట్లకు పైగా ఉంటుంది.  ఏకాగ్రహ వయసు నాలుగు నెలలు. దీంతో అతడు ఇండియాలో అత్యంత పిన్న వయస్కుడైన మిలియనీర్‌‌గా మారాడు. 

భారతదేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన ఇన్ఫోసిస్‌‌లో మూర్తికి 0.36 శాతం వాటా ఉంది.  ఏకాగ్రహ రోహన్ మూర్తికి మూడవ మనవడు. రోహన్ మూర్తి,  అపర్ణ కృష్ణన్ కుమారుడు. కూతురు అక్షతా మూర్తి భర్త బ్రిటన్​ప్రధాని రిషి సునక్​. డిసెంబర్ 2021లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌‌లో తన పాత్ర నుంచి వైదొలిగిన ఇన్ఫోసిస్ కో–ఫౌండర్​ సుధా మూర్తి, తన కుటుంబ ఫౌండేషన్ ద్వారా తన సేవా కార్యక్రమాలను చేస్తున్నారు.