ఎల్ బీహెచ్ఎం ఆల్ ఇండియా ఓపెన్ ఫీడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ లో ‘నారాయణ’ విద్యార్థి ప్రతిభ

ఎల్ బీహెచ్ఎం ఆల్ ఇండియా ఓపెన్ ఫీడే రేటెడ్ చెస్ టోర్నమెంట్ లో ‘నారాయణ’ విద్యార్థి ప్రతిభ

హైదరాబాద్, వెలుగు: ఫీడే (ఎఫ్​ఐడీఈ), ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ (ఏఐసీఎఫ్) గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక ‘ఎల్​బీహెచ్​ఎం ఆల్ ఇండియా ఓపెన్ ఫీడే రేటెడ్ చెస్ టోర్నమెంట్’లో నారాయణ స్కూల్స్ కు చెందిన విద్యార్థి క్షివ్ చకావే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సాధించాడు. దేశవ్యాప్తంగా 200 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్న ఈ టోర్నమెంట్​లో అండర్-– 6 విభాగంలో 3వ ర్యాంక్ సాధించి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.

తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ క్లిప్ 1560 ఫీడే రేటింగ్ ను సాధించాడు. తద్వారా అండర్-6 విభాగంలో ప్రపంచంలోని టాప్ 10 క్రీడాకారులలో ఒకరిగా నిలవడమే కాకుండా, భారతదేశంలో 3వ ర్యాంక్, మహారాష్ట్రలో తన వయస్సు విభాగంలో నం.1 ర్యాంక్ క్రీడాకారుడిగా స్థానం దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ పి. సింధూర నారాయణ క్షివ్ చకావేను అభినందించారు.