V6 News

జేఈఈ మెయిన్‌‌ ఫలితాల్లో నారాయణ సత్తా..ఆలిండియా 10వ ర్యాంకు కైవసం

జేఈఈ మెయిన్‌‌ ఫలితాల్లో నారాయణ సత్తా..ఆలిండియా 10వ ర్యాంకు కైవసం

హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో తమ స్టూడెంట్లు మరోసారి సత్తాచాటారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి. సింధూర, పి. శరణి, రమా నారాయణ వెల్లడించారు. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 10వ ర్యాంకుతో పాటు టాప్ 25లోపు 8, 100లోపు 24, 1000 లోపు 165 అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకుని జేఈఈ మెయిన్ ఛాంపియన్‌‌గా నిలిచినట్లు తెలిపారు. నారాయణ విద్యార్థి తమ్మిన గిరీశ్ ఆలిండియా 10వ ర్యాంకు సాధించగా.. బాలికల విభాగంలో మల్లవరపు ఆస్నా ఆలిండియా ఫస్ట్ ర్యాంకుతో చరిత్ర సృష్టించిందని వివరించారు.

దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో(తెలంగాణ, కర్నాటక, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, దిల్లీ, ఉత్తరప్రదేశ్)నారాయణ విద్యార్థులే స్టేట్ టాపర్లుగా నిలిచారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం ఫలితాల్లో 100 పర్సంటైల్ సాధించినవారిలో 27 శాతం మంది నారాయణ విద్యార్థులేనని వెల్లడించారు. ఈ విజయానికి నారాయణ అందించే పటిష్టమైన ప్రణాళిక, ఎన్-లెర్న్ యాప్ ద్వారా ఆన్‌‌లైన్ శిక్షణ, నిరంతర పరిశోధన ఆధారిత ప్రోగ్రామ్‌‌లే పునాదులని వివరించారు.

అత్యధిక సంఖ్యలో తమ విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌‌డ్ పరీక్షకు అర్హత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఐఐటీ ప్రవేశాలకు నారాయణే సరైన చిరునామా అని మరోసారి నిరూపితమైందని చెప్పారు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి సంస్థ డైరెక్టర్లు అభినందనలు తెలియజేశారు.