ఎయిరిండియా, బోయింగ్ డీల్.. ఇదో చారిత్రక ఒప్పందం : జో బైడెన్

ఎయిరిండియా, బోయింగ్ డీల్.. ఇదో చారిత్రక ఒప్పందం : జో బైడెన్

ప్రధాని నరేంద్రమోడీ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మంగళవారం ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఎయిరిండియా, బోయింగ్ సంస్థల మధ్య జరిగిన చారిత్రక ఒప్పందంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. బోయింగ్ నుంచి 200లకు పైగా విమానాలు కొనుగోలు చేసేందుకు ఎయిరిండియా డీల్ కుదుర్చుకోవడంపై ఇరువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో అమెరికాలోని 44 రాష్ట్రాల్లో 10లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని జో బైడెన్ అన్నారు. ఈ డీల్ తో అమెరికా, భారత్ మధ్య ఉన్న వాణిజ్య బంధం మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఎయిరిండియా బోయింగ్ నుంచి 220 విమానాలు కొనుగోలు చేయనుంది. అందులో 190 బీ737 మ్యాక్స్, 20 బీ787, 10 బీ777ఎక్స్‌ ఎయిర్ క్రాప్ట్ లు ఉన్నునాయి. ఈ డీల్ విలువ 34 బిలియన్ డాలర్లుకాగా.. ఎయిరిండియా మరో 70 విమానాల కొనుగోలుకు ప్లాన్ చేస్తోంది. అదే జరిగితే డీల్ విలువ 45.9 బిలియన్ డాలర్లకు చేరుతుందని వైట్ హౌస్ ప్రకటించింది.