- ఫుజైరా చమురు నిల్వ కేంద్రం వద్ద మంటలు
- ముగ్గురు భారతీయులకు గాయాలు
అబుదాబి: హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడం’కు ప్రతిచర్యగా ఇరాన్ మళ్లీ దాడులు మొదలుపెట్టింది. ఏప్రిల్ ప్రారంభంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణను పక్కనపెట్టి సోమవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై నాలుగు క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడులతో ఫుజైరాలోని కీలక చమురు నిల్వ కేంద్రం వద్ద మంటలు చెలరేగాయి. అక్కడ పనిచేస్తున్న ముగ్గురు ఇండియన్లు కూడా గాయపడ్డారు. యూఏఈ తీరంలోని మరో రెండు సరకు రవాణా నౌకలకు కూడా మంటలు అంటుకున్నట్లు సమాచారం. ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తమ నౌకల ప్రయాణానికి ఇరాన్ అడ్డుతగిలితే ‘బలప్రయోగం’ (ఫోర్స్ ఫుల్ రెస్పాన్స్) తప్పదని హెచ్చరించారు.
