నార్ల వెంకటేశ్వర రావు గొప్ప ఆలోచనాపరుడు : ప్రొ. మృణాళిని

నార్ల వెంకటేశ్వర రావు  గొప్ప ఆలోచనాపరుడు : ప్రొ. మృణాళిని

జూబ్లీహిల్స్, వెలుగు: అంబేడ్కర్ ఓపెన్ యునివర్సిటీలో ప్రముఖ పాత్రికేయులు, సంపాదకులు స్వర్గీయ నార్ల వెంకటేశ్వరరావు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆర్య విశ్వవిద్యాలయం, సిలికాంధ్ర (అమెరికా) ఆచార్యులు ప్రొ.సి.మృణాళిని హాజరై ‘నార్ల సాహిత్య రచనలు- విశ్లేషణ’ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. 

నార్ల ఒక పాత్రికేయులే కాకుండా అసమానతల పట్ల సమాజాన్ని జాగృత పరిచే గొప్ప ఆలోచనా పరులని కొనియాడారు. మానవ విలువలు, హేతువాదం, సామాజిక అన్యాయాలను విమర్శించడంపై ఆయన రచనలు ప్రజలను ఆలోచింపజేశాయని వివరించారు. వీసీ ఘంటాచక్రపాణి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిలో నార్ల లాంటి పాత్రికేయులు సమాజానికి చాలా అవసరమన్నారు. అన్ని విభాగాల అధిపతులు, డీన్స్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.