హైదరాబాదీలకు బిగ్ అలర్ట్‎: ఔటర్ సర్వీస్ రోడ్డులోకి మూసీ వరద: నార్సింగ్ ఔటర్ సర్వీస్ రోడ్డు, ఔటర్ ఎంట్రీ , ఎగ్జిట్ మూసివేత

హైదరాబాదీలకు బిగ్ అలర్ట్‎: ఔటర్ సర్వీస్ రోడ్డులోకి మూసీ వరద: నార్సింగ్ ఔటర్ సర్వీస్ రోడ్డు, ఔటర్ ఎంట్రీ , ఎగ్జిట్ మూసివేత

రంగారెడ్డి: హైదరాబాద్‎తో పాటు తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‎లో కురుస్తోన్న కుండపోత వానలతో సిటీ జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‎కు శుక్రవారం (ఆగస్ట్ 29) భారీగా వరద పొటెత్తింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను ఎత్తి నీటిని దిగువన ఉన్న మూసీకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లను ఒక్కసారిగా ఎత్తడంతో వరద ప్రవాహానికి పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. 

నార్సింగ్ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్ పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో నార్సింగ్ ఔటర్ సర్వీస్ రోడ్డు, ఔటర్ ఎంట్రీ, ఎగ్జిట్ మూసివేశారు అధికారులు. ఇతర మార్గాల నుంచి వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు అధికారులు. అలాగే, నార్సింగ్ మున్సిపాలిటీ మంచిర్యాల బ్రిడ్జి పై నుంచి వాటర్ వెళ్లడంతో నార్సింగ్-మంచిరేవులకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో మంచి రేవుల గ్రామానికి వెళ్లాలంటే సుమారు 10 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. నార్సింగ్ వద్ద ఔటర్ మూసివేతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకో మార్గం లేక చుట్టు తిరిగి వెళ్తున్నారు.