హైదరాబాద్: రామాంతపూర్ లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ సెంటర్ లో… నేషనల్ సైబర్ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ సెంటర్ ను ప్రారంభించారు కేంద్ర హోమ్ శాఖ సహాయకమంత్రి కిషన్ రెడ్డి. ఈ సెంటర్ లో BSF,CRPF,RPF,CISF తో పాటు రాష్ట్ర పోలీసులకు సైబర్ క్రైమ్, సైంటిఫిక్ టెక్నిక్స్ పై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో మాట్లాడిన కిషన్ రెడ్డి… రోజురోజుకు సైబర్ క్రైం పెరిగిపోతుందని అన్నారు. టెక్నాలజీ పెరగడంతో లైఫ్ ఈజీగా మారినా… సైబర్ సెక్యురిటీ మాత్రం ఒక చాలెంజ్ గా మారిందని చెప్పారు. సైబర్ క్రిమినల్స్ టెక్నాలజీని ఉపోయోగించుకొని నేరాలు చేస్తున్నారని అన్నారు.
హైదరాబాద్ లో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్స్ తో కలిసి నేషనల్ సైబర్ రీసెర్చ్, ఇన్నోవేషన్ కెపాసిటీ బిల్డింగ్ సెంటర్ ముందుకెళ్లాలని సూచిస్తున్నట్లు ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్ ని అరికట్టడానికి కేంద్ర హోమ్ శాఖ అనేక రకాలుగా ప్రయత్నిస్తోందని చెప్పారు. 35 ఏళ్లలోపు యంగ్ సైన్టిస్టుల కోసం దేశంలో 5 యంగ్ సైంటిస్ట్ లాబ్ లను ఏర్పాటు కేంద్రం చేయనుందని తెలిపారు.