V6 News

సంచార జాతులకు డీఎన్టీ సర్టిఫికెట్లు జారీ చేయండి : నేషనల్ డీఎన్టీ బోర్డు

సంచార జాతులకు డీఎన్టీ సర్టిఫికెట్లు జారీ చేయండి : నేషనల్ డీఎన్టీ బోర్డు
  •     బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు నేషనల్ డీఎన్టీ బోర్డు సూచన

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో సంచార, అర్ధ సంచార జాతులకు డీ నోటిఫైడ్ ట్రైబ్స్ సర్టిఫికెట్ల జారీ చేయాలని కేంద్ర ప్రతినిధులు సూచించారు. ఈ మేరకు సంచార జాతుల అభివృద్ధి, సంక్షేమ బోర్డు సభ్యులు భారత్‌‌‌‌‌‌‌‌భాయ్ బాబుభాయ్ పాట్ని,  ప్రవీణ్ శివాజిరావ్ ఘుగే శనివారం బీసీ కమిషన్​ చైర్మ న్​ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్,  తిరుమలగిరి సురేందర్ , బాలలక్ష్మితో సమావేశమయ్యారు. 

వారు మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటివరకు 7 రాష్ట్రాల్లో మాత్రమే డీఎన్‌‌‌‌‌‌‌‌టీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని, మిగిలిన రాష్ట్రాల్లోనూ వీటిని జారీ చేసేలా అవగాహన కల్పించేందుకే తాము ఈ పర్యటన చేస్తున్నట్లు చెప్పారు.  ఈ పథకం కింద విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలకు శిక్షణ పొందేలా స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.