ప్రాచీన భాషలను ప్రోత్సహిస్తామన్న మోడీ

ప్రాచీన భాషలను ప్రోత్సహిస్తామన్న మోడీ

నూతన జాతీయ విద్యావిధానం లక్ష్యం సంకుచిత విద్యావ్యవస్థ నుంచి విద్యార్థులను బయటకు తీసురావడమేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 21వ శతాబ్ధం ఆధునిక ఆలోచనలతో జాతీయ విద్యావిధానాన్ని ఏకీకృతం చేస్తున్నామన్నారు. యూపీలో రెండోసారి అధికారంలోకి వచ్చి 100రోజులు పూర్తైన సందర్భంగా వారణాసిలో  మోడీ పర్యటించారు. అక్షయ పాత్ర మిడ్ డే మీల్స్ కిచెన్ ను పరిశీలించారు. దాదాపు లక్ష మంది విద్యార్థులకు మిడ్ డే మీల్స్ అందించే సెంటర్ ను ప్రారంభించారు. 1200 కోట్ల రూపాయల విలువైన పథకాలకు మోడీ శంకుస్థాపన చేశారు. తర్వాత అఖిల భారతీయ శిక్షా సమాగమ్ లో ప్రధాని పాల్గొన్నారు. ఈ శతాబ్ధం విద్యార్థులను డిగ్రీపట్టాల కోసం సిద్ధం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రాంతీయ భాషలో విద్యకు మార్గం సుగమం చేశామన్నారు. విద్యాసంస్థల్లో మౌలికసదుపాయాలు పెంచామన్నారు. సంస్కృతం లాంటి ప్రాచీన భాషలను ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశం ఇవాళ రియాల్టీలో బతుకుతుందన్నారు. కోవిడ్ నుంచి దేశం వేగంగా కోలుకోవడమే కాకుండా.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలిచిందన్నారు.